ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్నది వీరే

ఇండస్ట్రీలో పేర్లు మార్చుకున్నది వీరే
x
Highlights

సిల్వర్ స్క్రీన్ పైన పేరు మార్చుకోవడం అనేది కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏమీ కాదు. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఇలా పేరు మార్చుకోవడం వెనుక...

సిల్వర్ స్క్రీన్ పైన పేరు మార్చుకోవడం అనేది కొత్తగా వస్తున్న ట్రెండ్ ఏమీ కాదు. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ నడుస్తుంది. అయితే ఇలా పేరు మార్చుకోవడం వెనుక రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో అప్పటికే ఆ పేరుతో కొంతమంది ఫేమస్ అయి ఉండవచ్చు లేదా న్యూమరాలజీ ప్రకారం అయిన జరగవచ్చు.. అలా పేరు మార్చుకొని ఫేమస్ అయిన నటినటులు ఎవరో ఒక్కసారి తెలుసుకుందాం.

రజినీకాంత్ :

సినిమాల్లోకి రాకముందు అయన పేరు శివాజీ రావు గైక్వాడ్ .. ఆ తర్వాత రజినీకాంత్‌ గా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదిగాడు.

శోభన్‌బాబు :

అయన అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు.. ఇండస్ట్రీ కి వచ్చాక శోభన్ బాబు గా పేరు మార్చుకున్నారు.

కృష్ణ:

అయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.. కానీ చిన్నగా ఉండాలని కృష్ణగా మార్చుకున్నారు.

మురళీ మోహన్ :

అయన అసలు పేరు రాజబాబు.. కానీ అప్పటికే రాజబాబు అనే పేరుతో కమెడియన్ ఉండటం, అతను మంచి సక్సెస్ లో ఉండడంతో అయన పేరును మురళీ మోహన్‌గా మార్చుకున్నారు.

చిరంజీవి :

సినిమాల్లోకి రాకముందు అయన పేరు శివ శంకర వరప్రసాద్. కానీ అయనకి ఓ రోజు కలలో ఆంజనేయ స్వామి కనిపించి చిరంజీవి అని పిలవడంతో అదే పేరును అయన పెట్టుకున్నారు. పలు సందర్బాలలో చిరు ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు

సినిమాల్లోకి రాకముందు అయన అసలు పేరు భక్త వత్సలం నాయుడు..కానీ అయన పేరును మోహన్ బాబు గా దర్శకులు దాసరి నారాయణ రావు మార్చారు. ఈ విషయాన్ని మోహన్ బాబు పలు సందర్బాలలో చెప్పుకొచ్చారు.

రవితేజ

సినిమాల్లోకి రాకముందు అయన అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు.. ఆ తర్వాత రవితేజ గా పేరు మార్చుకున్నారు.

నాని

హీరో నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు

అంజలి దేవి

అంజలి దేవి అసలు పేరు అంజమ్మ.. ఆ తర్వాత అంజనీ కుమారిగా మారింది. అప్పట్లో సీత పాత్ర వేయాలంటే ఆమెకే ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చేవారు.

జయలలిత

నటి, దివంగత నేత జయలలిత అసలు పేరు కోమలవల్లి సినిమాల్లోకి వచ్చాక జయలిలితగా ఆమె పేరును మార్చుకున్నారు.

విజయ నిర్మల

సూపర్ స్టార్ కృష్ణ భార్య అయిన విజయ నిర్మల అసలు పేరు నిర్మల.. ఆమెకి నటిగా అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా తన పేరు ముందు విజయ అని పెట్టుకున్నారు.

శ్రీదేవి

శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్ప.. కానీ ఆ తర్వాత శ్రీదేవి గా పేరు మార్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

రోజా

ఆమె అసలు పేరు శ్రీలత రెడ్డి.. కానీ ఆ తర్వాత రోజా అని పేరు మార్చుకున్నారు. రాజకీయాల్లో కూడా ఆమె ఇదే పేరుతో కొనసాగుతున్నారు.

నయనతార

ఆమె అసలు పేరు డయానా మరియమ్ కురియన్.. సినిమాల్లోకి రాకముందు ఓ మలయాళ ఛానల్ లో యాంకర గా ఇదే పేరుతో పనిచేసింది. ఇక సినిమాల్లోకి వచ్చాక మాత్రం పేరు నయనతారగా పేరు మార్చుకుంది.

అంజలి

ఆమె అసలు పేరు బాలాత్రిపుర సుందరి కానీ a ఆ తర్వాత అంజలిగా స్థిరపడిపోయింది.

ఇలానే చాలా మంది నటీనటులు తమ పేరును మార్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories