logo
సినిమా

Liger Movie: భారీ మొత్తానికి అమ్ముడైన "లైగర్" నాన్ థియేట్రికల్ రైట్స్

Liger Movie Non-Theatrical Rights Sold for a Huge Amount
X

Liger Movie: భారీ మొత్తానికి అమ్ముడైన "లైగర్" నాన్ థియేట్రికల్ రైట్స్

Highlights

Liger Movie: భారీ మొత్తానికి అమ్ముడైన "లైగర్" నాన్ థియేట్రికల్ రైట్స్

Liger Movie: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. అందుకే తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "లైగర్" పైనే పెట్టుకున్నాడు ఈ యువ హీరో. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. అనన్య పాండే కి తెలుగు లో ఇది మొదటి సినిమా కాగా విజయ్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ సినిమా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా చిత్ర బృందం సినిమా షూటింగ్ని పూర్తి చేసింది.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ సినిమా కి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను 60 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మళ్ళీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో "జనగణమన" అనే సినిమాతో బిజీ కాబోతున్నారు.

Web TitleLiger Movie Non-Theatrical Rights Sold for a Huge Amount
Next Story