Continental Hospital Doctors: క్రిటికల్ స్టేజ్‌లో ఉండటం వల్ల ప్రతిగంటా ముఖ్యమే.. కృష్ణ ఆరోగ్యం మెరుగుపడాలని అందరం ప్రార్థిద్దాం..

Continental Hospital Doctors: సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Arun Chilukuri
Updated on: 14 Nov 2022 3:04 PM IST
Lets Pray for Krishnas Well Being, Says Doctors
X

Continental Hospital Doctors: క్రిటికల్ స్టేజ్‌లో ఉండటం వల్ల ప్రతిగంటా ముఖ్యమే.. కృష్ణ ఆరోగ్యం మెరుగుపడాలని అందరం ప్రార్థిద్దాం..

Continental Hospital Doctors: సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కృష్ణ ఆరోగ్యంపై డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కృష్ణకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్న వైద్యులు... 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. ఇప్పటి నుంచి ప్రతి గంటా కీలకమేనని, ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు కృష్ణ స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన గుండెపోటు నుంచి బయటపడేలా చేశామని, ప్రస్తుతం కాస్త నిలకడగానే ఉన్నా ఆందోళనకరంగానే పరిస్థితి ఉందని వైద్యులు వెల్లడించారు.

ఏ పేషెంట్‌కైనా చివరి వరకు చికిత్స అందిస్తామన్న కాంటినెంటల్‌ డాక్టర్లు శరీరం చికిత్సకు సహకరిస్తుందా.. లేదా..? అనేది చెప్పలేమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కృష్ణకు చికిత్స అందిస్తున్నామని కృష్ణ ఆరోగ్యం మెరుగుపడాలని అందరం ప్రార్థిద్దామని డాక్టర్లు చెప్పారు. కృష్ణ అనారోగ్యం విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story