Top
logo

రాఘవ లారెన్స్ సినిమా నుండి తప్పుకోవడం వెనుక కారణం ఇదేనట

రాఘవ లారెన్స్ సినిమా నుండి తప్పుకోవడం వెనుక కారణం ఇదేనట
Highlights

రాఘవ లారెన్స్ హీరోగానే కాక దర్శకత్వం కూడా వహించిన 'ముని' సిరీస్ తెలుగు తమిళ భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ...

రాఘవ లారెన్స్ హీరోగానే కాక దర్శకత్వం కూడా వహించిన 'ముని' సిరీస్ తెలుగు తమిళ భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ముని సినిమా తరువాత 'కాంచన' సీరీస్ లోనే మూడు భాగాలు విడుదలై మంచి హిట్ లుగా మారాయి. అయితే ఇప్పుడు కాంచన సినిమా హిందీ లో రీమేక్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమా లో హీరోగా నటిస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తాడు అని అధికారిక ప్రకటన చేశారు. కానీ ఉన్నట్టుండి లారెన్స్ తనంతట తానుగా ఈ సినిమా నుండి తప్పుకుని పెద్ద షాక్ ఇచ్చాడు.

అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కాంఫైర్మ్ చేస్తూ, తను డబ్బు, పేరు కంటే తన ఆత్మాభిమానాని కి ఎక్కువ గౌరవం ఇస్తాను అని అందుకే సినిమా నుండి తప్పుకుంటున్నానని అన్నారు. దీనికి గల చాలా కారణాల్లో ఒకటి తనకి తెలియకుండానే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడమని అన్నారు. ఒక దర్శకుడిగా అది తనని చాలా బాధించింది అని, అందుకే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ అన్నారు. త్వరలో అక్షయ్ కుమార్ ని కలిసి తన స్క్రిప్ట్ ని అందజేస్తానని లారెన్స్ అన్నారు.

Next Story