Lavanya Tripathi: మెగా కోడలు గుడ్ న్యూస్.. పెళ్లైన ఏడాది తర్వాత..

Lavanya tripathi Announcement Of Her New Movie Post Shared
x

మెగా కోడలు గుడ్ న్యూస్.. పెళ్లైన ఏడాది తర్వాత..

Highlights

మెగా కోడలు లావణ్య త్రిపాఠి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. పెళ్లైన ఏడాది తర్వాత సతీలీలావతి అనే సినిమాకు శ్రీకారం చుట్టారు.

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. పెళ్లైన ఏడాది తర్వాత సతీలీలావతి అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. రెండు వారాల క్రితం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్‌ను లావణ్య త్రిపాఠి షేర్ చేశారు.

సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి మెగా కోడలు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయినట్టు లావణ్య త్రిపాఠి ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్లైన తర్వాత లావణ్య నటిస్తున్న మొదటి చిత్రమిది. తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వేసవి ఫన్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్రబృందం ఫొటోను పంచుకుంది. దీంతో త్వరలోనే సినిమా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.

అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా పరిచయమ్యారు. తొలి సినిమాతోనే క్యూట్ నెస్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య వరుస అవకాశాలు దక్కించుకున్నారు. సినిమాలు చేస్తున్న క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.

ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత లావణ్య, వరుణ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో 2023 నవంబర్ 1 వీరిద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. కానీ లావణ్య మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇటీవల కాలంలో మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. సినిమాలకు దూరంగా ఉంటూ తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. సతీలీలావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories