Top
logo

దొంగతనం చేయబోతున్న నాని అండ్ టీం

దొంగతనం చేయబోతున్న నాని అండ్ టీం
X
Highlights

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ఎట్టకేలకు 'జెర్సీ' అనే...

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాసు' వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ఎట్టకేలకు 'జెర్సీ' అనే సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో నాని నటన అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత నాని త్వరలో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

టైటిల్ విషయంలో కొన్ని వివాదాలు నెలకొన్నప్పటికీ అవి త్వరగానే సద్దుమణిగి పోయాయి. తాజా సమాచారం ప్రకారం నాని ఒక దొంగల బ్యాచ్ కి గ్యాంగ్ లీడర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. వేరు వేరు వయసు ఉన్న ఐదుగురు మహిళలతో కలిసి నాని దొంగతనాలు చేస్తుంటాడట. తన గ్యాంగ్ లో నాని లేడీస్ ని మాత్రమే ఎందుకు పెట్టుకున్నాడు? వాళ్లు ఎలా దొంగతనాలు చేస్తున్నారు చేస్తారు? అని విక్రమ్ స్టైల్ లో కామెడీ ఉండబోతుందట. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Next Story