Laila OTT Release: అప్పుడే ఓటీటీలోకి లైలా.. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచేనా.?

Laila OTT Release
x

Laila OTT Release: అప్పుడే ఓటీటీలోకి లైలా.. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచేనా.?

Highlights

Laila OTT Release: డీల్ కంటే ముందుగానే ‘లైలా’ చిత్రం ఓటీటీలోకి వస్తుందని సమాచారం. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో లైలా సినిమా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం.

Laila OTT Release: జయాపజయాలతో అతీతంగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదాది, మెకానిక్ రాకీ ఇలా వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా లైలా మూవీతో ప్రేక్షులకు పలకరించారు విశ్వక్‌. ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలనే కసితో వచ్చారు విశ్వక్‌.

ఈ సినిమాలో ఏకంగా మహిళ గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీలో ఇరుక్కోవడం, తొలి షో నుంచే నెగిటివ్‌ టాక్‌ రావడంతో లైలా మూవీ ఒకరకంగా చెప్పాలంటే డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేవని చెప్పాలి.

ఇది సినిమాపై భారీగా ప్రభావం పడింది. దీంతో సినిమా విడుదలై వారం రోజులు కూడా గడవకముందే ఈ సినిమా ఓటీటీ రీలిజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాధారణంగా థియేటర్లలో సినిమా విడుదలైన కనీసం 50 రోజులకు ఓటీటీలోకి తీసుకొస్తున్నారు ప్రొడ్యుసర్స్‌. అయితే లైలా నెగిటివ్‌ టాక్‌ను మూట గట్టుకోవడంతో నెల రోజుల లోపే ఓటీటీలోకి సినిమాను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

డీల్ కంటే ముందుగానే ‘లైలా’ చిత్రం ఓటీటీలోకి వస్తుందని సమాచారం. మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో లైలా సినిమా స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నారాయణ్ తెరకెక్కించిన లైలా సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిశోర్, రవి మారియా, నాగి నీడు, హర్ష వర్దన్, బ్రహ్మాజీ, రఘు బాబు, అభిమన్యు సింగ్, పృథ్వీ రాజ్‌తో పాటు పలువురు నటించారు. కాగా పృథ్వీరాజ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories