Sanjay Dutt: ఇంత అభిమానమా.. చనిపోయే ముందు ఆ హీరోకి రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని

Lady Fan 72cr Property Transfer Actor Sanjay Dutt
x

ఇంత అభిమానమా.. చనిపోయే ముందు ఆ హీరోకి రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని

Highlights

సినీ హీరోలకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టిన రోజులకు రక్తదానం.. సినిమాలు విడుదలైతే ఫ్లెక్సీలు కట్టడం, పాలాభిషేకాలు చేయడం చూస్తూనే ఉంటాం.

Sanjay Dutt: సినీ హీరోలకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టిన రోజులకు రక్తదానం.. సినిమాలు విడుదలైతే ఫ్లెక్సీలు కట్టడం, పాలాభిషేకాలు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ ఈ అభిమాని అభిమానం మాత్రం మామూలుగా లేదు. తాను చనిపోయే ముందు తన అభిమాన హీరోకు దాదాపు రూ.72 కోట్ల రూపాయలను రాసిచ్చింది. ఆ హీరో ఎవరో కాదు సంజయ్ దత్. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

ముంబైకి చెందిన నిషా పాటిల్‌కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం. ఆయన నటించిన ప్రతి సినిమాను చూసేది. 62 సంవత్సరాలు ఉన్న నిషా కొద్దిరోజుల క్రితమే అనారోగ్యంతో మరణించారు. తాను చనిపోతానని ముందే గ్రహించిన నిషా పాటిల్.. తన పేరిట ఉన్న దాదాపు రూ.72 కోట్ల విలువైన ఆస్తులను సంజయ్ దత్ పేరిట రాసిచ్చారు. 2018లోనే తన ఆస్తి, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బు సంజయ్ దత్‌కు చెందేలా వీలునామా రాయించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆ వీలునామా దస్తావేజులు సంజయ్ ఇంటికి వచ్చాయి. విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్‌కు గురయ్యారు.

పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చలించిపోయారు. అయితే ఆ ఆస్తిని మాత్రం సంజయ్ దత్ తీసుకోలేదు. దానిని తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీంకు సూచించారు. ఇంత గొప్ప అభిమానని కలుసుకోలేకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని సంజయ్ దత్ తెలిపారు. ఇక ఆమె అభిమానానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం ఫ్లెక్సీలు కట్టడం పాలాభిషేకం, రక్తదానం చేసిన అభిమానులనే చూశాం. మొదటి సారి ఆస్తిని రాసిచ్చిన అభిమానిని చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సంజయ్ దత్ ఆస్తిని తిరిగి వారి కుటుంబానికి ఇవ్వడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

1971లో తన తండ్రి సునీల్ దత్ నిర్మించిన రేష్మ ఔర్ షెరాలో బాల నటుడిగా సంజయ్ దత్ ఎంట్రీ ఇచ్చారు. సాజన్, ఖల్నాయక్, వాస్తవ్, మిషన్ కాశ్మీర్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, నామ్, ముసాఫిర్, అగ్నిపథ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఇక లియో, కేజీఎఫ్-2 వంటి చిత్రాల్లో విలన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం భాగీ-4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories