Kubera : లెన్త్ కోసం కుబేర టీమ్ కసరత్తు..!

Kubera : లెన్త్ కోసం కుబేర టీమ్ కసరత్తు..!
x

Kubera : లెన్త్ కోసం కుబేర టీమ్ కసరత్తు..!

Highlights

ఇంకా పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "కుబేర" సినిమాకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో మాత్రం నిపుణుల్లా వ్యవహరిస్తున్నారు

Kubera : ఇంకా పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "కుబేర" సినిమాకు తక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో మాత్రం నిపుణుల్లా వ్యవహరిస్తున్నారు నిర్మాతలు సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు. స్వయంగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాడు. మరోవైపు, అఖిల్ పెళ్లి కారణంగా బిజీగా ఉన్న నాగార్జున వేడుకలు పూర్తైన నేపథ్యంలో వచ్చే రెండు రోజుల్లోనే మీడియా, అభిమానులతో కనెక్ట్ కావడానికి సిద్ధమవుతున్నాడు. హీరో ధనుష్ కూడా హైదరాబాద్‌కు వచ్చేందుకు రెడీగా ఉండగా, జూన్ 13 నుంచి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు.

సెన్సార్ పూర్తి.. ఎడిటింగ్ మళ్లీ మొదలు

ఇటీవలే కుబేర సెన్సార్ పూర్తయ్యింది. 3 గంటల 15 నిమిషాల నిడివితో U/A సర్టిఫికెట్ అందుకుంది. అయితే ఇంత భారీ నిడివి ఆడియన్స్‌కు భారం అవుతుందేమోననే అనుమానంతో, చిత్రబృందం ఇప్పుడు ఎడిటింగ్ పనిలో నిమగ్నమైంది.

సెన్సార్ పూర్తయిన వెర్షన్‌ నుంచి అవసరానికి అనుగుణంగా కత్తిరింపులు చేయవచ్చు కానీ కొత్త సన్నివేశాలు జోడించలేరు. అలా చేస్తే మళ్లీ సెన్సార్‌కు అప్లై చేయాల్సి ఉంటుంది. అందుకే ముందే లెన్తీ వెర్షన్‌ను సర్టిఫికేషన్ కోసం పంపించి, ఇప్పుడు దానిని 2 గంటల 50 నిమిషాలకు కుదించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే 3 గంటల లోపే పెట్టేందుకు యత్నిస్తున్నారు.

శేఖర్ సినిమాలకు లెన్త్ కామన్

దర్శకుడు శేఖర్ కమ్ముల గత చిత్రాలంతా ఎక్కువ నిడివి కలిగినవే. ఉదాహరణకు "ఆనంద్" తొలి లాక్ చేసిన వెర్షన్ మూడు గంటలు మించి ఉండేది. కానీ కొత్త నటులతో, సాఫ్ట్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఆసక్తి తక్కువగా ఉంటుందని భావించి 20 నిమిషాలు కట్ చేసి విడుదల చేశారు. అదే డివిడిలో మాత్రం పూర్తి వెర్షన్‌ను చూపించారు.

కుబేర సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉన్నా, కాన్సెప్ట్ డిఫరెంట్ కావడంతో కథను క్రిస్ప్‌గా, ఎంగేజింగ్‌గా చూపించడం బెటర్ అన్న అభిప్రాయంతో నిడివి కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో పుష్ప 2, యానిమల్ లాంటి సినిమాలే ఉదాహరణగా నిలుస్తాయి. అవి మూడు గంటల పైగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. కుబేరలోనూ అదే స్థాయిలో కంటెంట్ ఉంటే నిడివి పెద్దగా ఇబ్బందికరం కాదు. అయితే బలమైన కథ, ప్రదర్శనతో ఆకట్టుకోవడమే కీలకం.

ఇక చూడాల్సిందల్లా, కుబేర ఎడిటెడ్ వెర్షన్ ఎలాంటి ఫలితాలు తెస్తుందన్నది..!

Show Full Article
Print Article
Next Story
More Stories