ఆత్మ పాత్రలో కనిపించనున్న కృతి శెట్టి

Krithi Shetty will be seen in the role of soul | Tollywood News
x

ఆత్మ పాత్రలో కనిపించనున్న కృతి శెట్టి

Highlights

*ఆత్మ పాత్రలో కనిపించనున్న కృతి శెట్టి

Krithi Shetty: "ఉప్పెన" సినిమాతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత "బంగార్రాజు" సినిమాతో కూడా బాగానే మెప్పించింది. అలా వరుసగా రెండు సూపర్ హిట్ల తర్వాత గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి వరుసగా "వారియర్", "మాచర్ల నియోజకవర్గం" వంటి రెండు డిజాస్టర్లు తగలడంతో ఐరన్ లెగ్ గా మారిపోయింది. తాజాగా తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" పైన పెట్టుకుంది ఈ భామ.

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ట్రైలర్ చూస్తే కృతి శెట్టి పాత్ర విభిన్నంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కాకుండా కృతి శెట్టి వెంకట్ ప్రభు మరియు నాగచైతన్య కాంబోలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి ఒక హారర్ టచ్ ఉన్న ఆత్మ పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విభిన్న నేపథ్యంలో ఈమె పాత్ర ను డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల భోగట్ట. అయితే మెయిన్ హీరోయిన్ కూడా తనే కాబట్టి ఏదో ఒక ట్విస్ట్ ఉండే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈమె పాత్ర గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఏదేమైనా ఈ రెండు సినిమాలతో కృతి శెట్టి కెరియర్ ట్రాక్ లో పడుతుందో లేదో చూడాలి .

Show Full Article
Print Article
Next Story
More Stories