Krithi Shetty: స్పెషల్ సాంగ్‌లో బేబమ్మ..

Krithi Shetty Decided Special Song
x

స్పెషల్ సాంగ్‌లో బేబమ్మ.. 

Highlights

కృతిశెట్టిలో కూడా తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. అందుకే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

Krithi Shetty: ప్రస్తుత సినిమాల్లో ఐటమ్ సాంగ్ తప్పనిసరి. అయితే ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అటు సినిమాలు ఇటు స్పెషల్ సాంగ్స్‌తో ఆదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్‌లో నటించి మెప్పించారు. తాజాగా ఈ జాబితాలో కృతిశెట్టి కూడా చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినీ పరిశ్రమలకు బాగా వర్తిస్తుంది. ఈ విషయంలో హీరోయిన్స్ ఎప్పుడూ ముందుంటారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అటు సినిమాలు.. ఇటు స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్, పూజా హెగ్డే, శృతిహాసన్, శ్రీలీల తదితరులు ఐటమ్ సాంగ్‌లో నటించారు. ఇప్పుడు కృతిశెట్టిలో కూడా తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. అందుకే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి.. బేబమ్మగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ, మనమే వంటి పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు.

మనమే సినిమా తర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు. కానీ తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకీ ఆమె ఏ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు..? ఇందులో వాస్తవమెంత అనే విషయాలపై స్పష్టత లేదు. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories