Krithi Shetty: రిస్క్ కి రెడీ అంటున్న కృతి శెట్టి

Krithi Shetty Acting a Oriented Film
x

ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధమైన కృతి శెట్టి(ఫైల్-ఫోటో)

Highlights

Krithi Shetty: కృతి శెట్టి ఈ మధ్యనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది

Krithi Shetty: "ఉప్పెన" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామకి ఇప్పుడు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే నాచురల్ స్టార్ నాని తో కృతి శెట్టి "శ్యామ్ సింగరాయ్" అనే సినిమాతో కనిపించబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కృతి శెట్టి ఈ మధ్యనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లోనే ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయడం అంటే రిస్క్ అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కనీసం ఒక ఇరవై పెద్ద కమర్షియల్ సినిమాల్లో నటించిన తర్వాతనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల వైపు చూస్తున్నారు. కానీ కేవలం ఒక్క సినిమాతో పేరు తెచ్చుకున్న కృతి మాత్రం ఇంత త్వరగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. మజ్ను, ఉయ్యాల జంపాల వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories