"సింధూరం" రీ రిలీజ్ చెయ్యమంటే షాకింగ్ జవాబు ఇచ్చిన కృష్ణవంశీ

Krishna Vamsi Gave a Shocking Answer to the Re-release of Sindhooram
x

"సింధూరం" రీ రిలీజ్ చెయ్యమంటే షాకింగ్ జవాబు ఇచ్చిన కృష్ణవంశీ

Highlights

Krishna Vamsi: "అమ్మో ఆ సినిమా కోసం ఐదేళ్లు అప్పులు కట్టాను," అంటున్న కృష్ణవంశీ

Krishna Vamsi: ఈమధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండు టాలీవుడ్ లో బాగానే నడుస్తోంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలను సృష్టించిన సినిమాలను అభిమానులు ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో చాలా వరకు సినిమాలు మళ్లీ థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లను కూడా నమోదు చేసుకుంటున్నాయి. ఆఖరికి నిన్న కాక మొన్న రీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ "ఖుషీ" సినిమా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన "సింధూరం" అనే సినిమాని కూడా రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాని మళ్లీ రిలీజ్ చేయమని సోషల్ మీడియా ద్వారా ఒక అభిమాని కృష్ణవంశీ ను ప్రశ్నించగా డైరెక్టర్ ఒక షాకింగ్ కామెంట్ చేశారు. "అమ్మో.. ఐదేళ్లు అప్పులు కట్టాను అయ్యా.. వామ్మో," అని ఆ సినిమా కోసం తాను చేసిన అప్పులు తీర్చడానికి ఐదేళ్లు పట్టింది అని కామెంట్ చేశారు కృష్ణవంశీ.

అయితే కృష్ణవంశీ కామెంట్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే 1997లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ కూడా కల్ట్ సినిమాగా నిలిచింది. బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. గోదావరి బ్యాంక్ డ్రాప్ లో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక వ్యక్తి కథ చుట్టూ సినిమా తిరుగుతుంది. అయితే కృష్ణవంశీ కామెంట్ చూసి అభిమానులు సినిమాని రీ రిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా మంచి కలెక్షన్లు వస్తాయని, కృష్ణవంశీ కట్టిన డబ్బులు కూడా తిరిగి వస్తాయని కామెంట్లు చేస్తున్నారు. మరి కృష్ణవంశీ ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories