ఒక్క డిజాస్టర్.. కొరటాల మీద రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న ప్రెషర్..

Koratala Shiva Is Facing Problems For One Disaster
x

ఒక్క డిజాస్టర్ తో తీవ్ర ఎదుర్కొంటున్న కొరటాల శివ

Highlights

* కొరటాల శివ మీద రోజు రోజుకి పెరుగుతూ వస్తున్న ప్రెషర్

Koratala Siva: అంతకుముందు వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయిన కొరటాల శివ కెరియర్ ఒక సినిమాతో మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాతో కొరటాల శివ మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ఈ సినిమా కొరటాల శివ కరియర్ ను బాగా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత ఎన్నో వివాదాలు ఇరుక్కున్న కొరటాల శివ పై తన తదుపరి సినిమా ప్రెషర్ కూడా పెరుగుతూనే వస్తోంది.

నిన్న మొన్నటి వరకు ఆచార్య సినిమా నష్టాల వ్యవహారంలో బిజీగా ఉన్న కొరటాల శివ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొరటాల శివ తదుపరి సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. "ఆర్ఆర్ఆర్" సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఏకంగా ఆస్కార్ రేంజ్ కి ఎదిగిపోయారు. కానీ రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరోలకు ఒక్క ఫ్లాప్ అయినా పడుతుందనే సెంటిమెంట్ కూడా ఎప్పటినుండో ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన "ఆచార్య" ఫ్లాప్ వల్లే కొరటాల కి చాలా తల నొప్పులు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే టెన్షన్ కూడా కొరటాలకు లేకపోలేదు. మరోవైపు NTR30 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ లేవు అని ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. దీంతో కొరటాల శివ పై కూడా చాలా ప్రెజర్ పెరిగిపోతుంది. ప్రస్తుతం షూటింగ్ కోసం చిత్ర బృందం సెట్స్ ను వేస్తున్నారు. షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories