కమల్, శంకర్ : ఇండియన్ 2 ఇక ఆగిపోయినట్టేనా?

కమల్, శంకర్ : ఇండియన్ 2 ఇక ఆగిపోయినట్టేనా?
x
Indian2
Highlights

ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హసన్ కాంబినేషన్ లో ఇండియన్ 2 తెరేకేక్కుతున్న సంగతి తెలిసిందే..

ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హసన్ కాంబినేషన్ లో ఇండియన్ 2 తెరేకేక్కుతున్న సంగతి తెలిసిందే.. ఏ ముహూర్తాన సినిమాని మొదలుపెట్టారో ఏమో కాని సినిమాకి అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. షూటింగ్ సమయంలో హీరో కమల్ కి కాలు దెబ్బ తాకడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది.. ఇక ఆ తర్వాత షూటింగ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్‌ ఉన్నారు.

ఇక ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం అని భావించేలోపు కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. ఇలా ప్రతీసారి సినిమాకి అవాంత‌రాలు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ 2 చిత్రాన్ని ఆపేస్తేనే బెట‌రేమో అని నిర్మాత‌లు ఆలోచిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో కమల్‌హాసన్‌, సిద్ధార్థ, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌కరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా 1996 లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడుకు ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. దీనితో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories