మరోసారి మానవత్వం చాటుకున్న హీరో సూర్య, కార్తీ

మరోసారి మానవత్వం చాటుకున్న హీరో సూర్య, కార్తీ
x
Surya and Karthi (File Photo)
Highlights

కరోనా ప్రభావం ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల పైన పడింది.

కరోనా ప్రభావం ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల పైన పడింది. ఇక చిత్ర పరిశ్రమలో భాగంగా షూటింగ్లు వాయిదా పడ్డాయి. థియేటర్లు కూడా మూతపడ్డాయి. సినిమా షూటింగ్లు వాయిదా పడడం వలన స్టార్ హీరోలకి వచ్చే సమస్య ఏం లేదు. కానీ సినిమా పరిశ్రమను నమ్ముకొని ఉన్న కొందరు కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. వారిపై సినీ పరిశ్రమలోని పెద్దలు కరుణ చూపిస్తున్నారు.

అందులో భాగంగా తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం ఫెప్సి కి సూర్య కుటుంబం (తండ్రి శివ కుమార్, తమ్ముడు కార్తీ) కలిసి 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కార్మికుల కోసం విరాళాన్ని అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల కోసం నిత్యవసర వస్తువులను అందిస్తున్నట్లు హీరో రాజశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories