Junior Teaser: కిరీటి రెడ్డి, శ్రీలీల, రాధా కృష్ణ, వారాహి చలన చిత్రం 'జూనియర్' కలర్‌ఫుల్ & ఫుల్-ఆన్ ఎంటర్‌టైనింగ్ టీజర్ రిలీజ్

Junior Teaser
x

కిరీటి రెడ్డి, శ్రీలీల, రాధా కృష్ణ, వారాహి చలన చిత్రం 'జూనియర్' కలర్‌ఫుల్ & ఫుల్-ఆన్ ఎంటర్‌టైనింగ్ టీజర్ రిలీజ్

Highlights

Junior Teaser: ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ జూనియర్‌తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ జూనియర్‌తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది.

ఈ టీజర్ సినిమా టోన్, హిలేరియస్, ఫుల్-ఆన్ ఎంటర్‌టైనింగ్ స్నాప్‌షాట్‌ను అందిస్తుంది. కిరీటి ఒక రిలాక్స్డ్ కాలేజీ కుర్రాడు, మార్క్స్ కంటే హ్యాపినెస్ ని ఇష్టపడతాడు, తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించే వ్యక్తిత్వం వున్న తను శ్రీలీలాను ఇష్టపతాడు, మొదట గొడవతో మొదలైన జర్నీ మెల్లాగా ఎట్రాక్టివ్ కెమిస్ట్రీగా మారుతుంది.

టీజర్ లో కిరీటి అదరగొట్టాడు. తన డ్యాన్స్ మూవ్స్, స్టంట్స్, స్పాట్-ఆన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా వున్నాయి.

టీజర్ లో కిరీటి చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. అందరినీ అలరించేలా వున్నాయి.

హీరోయిన్ గా శ్రీలీల కూల్‌గా కనిపించింది. టీజర్ చివరిలో బాస్ పాత్రతో జెనీలియా డిసౌజా కనిపించడం మరింత ఆసక్తికరంగా వుంది. వైవా హర్ష పాత్ర కామిక్ రిలీఫ్ ని ఇచ్చింది.

కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అదిరిపోయింది. ఆయన సంగీతం యూత్ ఎనర్జీ, సినిమాటిక్ పంచ్‌తో అలరించింది.

ఈ చిత్రానికి రవీందర్ ప్రొడక్షన్ డిజైన్, పీటర్ హెయిన్ హై-ఆక్టేన్ యాక్షన్ కొరియోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటర్. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

జూనియర్ తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషలలో జూలై 18న గ్రాండ్ గా విడుదల కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories