Kiran Abbavaram Marriage: వివాహబంధంతో ఒక్కటైన కిరణ్ అబ్బవరం - రహస్య గోరక్ ..వెడ్డింగ్ వీడియో వైరల్


Kiran Abbavaram Marriage: వివాహాబంధంతో ఒక్కటైన కిరణ్ అబ్బవరం - రహస్య గోరక్ ..వెడ్డింగ్ వీడియో వైరల్
Kiran Abbavaram : టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థం చేసుకొని పెళ్లిళ్ల సీజన్ కు తెరలేపగా. ప్రస్తుతం యువనటుడు హీరో కిరణ్ అబ్బవరం వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు. ప్రముఖ టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
Kiran Abbavaram : టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థం చేసుకొని పెళ్లిళ్ల సీజన్ కు తెరలేపగా. ప్రస్తుతం యువనటుడు హీరో కిరణ్ అబ్బవరం వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు. ప్రముఖ టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా హీరోయిన్ రహస్యతో కలిసి రిలేషన్షిప్ లో ఉన్న కిరణ్ అబ్బవరం ఎట్టకేలకు దంపతులుగా మారారు. 2019 వ సంవత్సరంలో రాజావారు రాణివారు అనే సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేశాడు. అదే సినిమాలో రహస్య హీరోయిన్ గా నటించింది. ఈ యువ జంట వెండితెరపై ప్రేమికులుగా కనిపించి ఇప్పుడు నిజ జీవితంలో కూడా దంపతులుగా మారడం విశేషం.
అయితే వీరిద్దరి మధ్య ఆ సినిమా షూటింగ్ సమయంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపించారు. ఇప్పుడు ఇద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టి ఒకటయ్యారు.
హీరోగా కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అడుగుపెట్టిన కిరణబ్బవరం నెమ్మదిగా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. రాజా వారు రాణివారు సినిమాతో ఈ తొలిసారి హీరోగా కనిపించిన కిరణ్ అబ్బవరం అదే ఏడాది సైమా బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు సైతం అందుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగాను అలాగే రైటర్ గా కూడా సత్తా చాటాడు.
ఆ తర్వాత సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరోగా మెప్పించాడు. 2023లో మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు పరాజయం పాలైనప్పటికీ ప్రస్తుతం క అనే సినిమాలో కిరణ్ అబ్బవరం నటిస్తున్నాడు.
ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. హీరోగా అదేవిధంగా రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఈ నూతన వివాహ బంధంతో విజయవంతంగా జీవితాన్ని ప్రారంభించాలని నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు. అయితే ఈ వివాహానికి కిరణ్ అబ్బవరం సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే టాలీవుడ్ ప్రముఖులు అందరికీ హైదరాబాదులో కిరణ్ అబ్బవరం దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
Exclusive visuals from the #KiranRahasya wedding
— Vamsi Kaka (@vamsikaka) August 22, 2024
The groom, @Kiran_Abbavaram, and the bride, #RahasyaGorak, look amazing at the wedding ceremony#KiranAbbavaram pic.twitter.com/D6eYhy8O1W

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



