Kingdom: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన మూవీ టీమ్.. పవర్ స్టార్ నుంచి బెస్ట్ విషెస్

Kingdom: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన మూవీ టీమ్.. పవర్ స్టార్ నుంచి బెస్ట్ విషెస్
x

Kingdom: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన మూవీ టీమ్.. పవర్ స్టార్ నుంచి బెస్ట్ విషెస్

Highlights

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కింగ్‌డమ్' జులై 31న థియేటర్లలో విడుదల కాబోతుంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కింగ్‌డమ్' జులై 31న థియేటర్లలో విడుదల కాబోతుంది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తాజాగా 'కింగ్‌డమ్' మూవీ టీమ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసింది. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్‌' సినిమా సెట్లో పవన్ కల్యాణ్‌ను విజయ్ దేవరకొండ, నటి భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ కలిసి దర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ చిత్రం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల 'హరిహర వీరమల్లు' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన పవన్.. ప్రస్తుతం 'ఓజీ' మరియు 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల కోసం శరవేగంగా పని చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, 'కింగ్‌డమ్' చిత్రం జూలై 26న హైదరాబాదులోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

ఇప్పటికే సినిమాపై ఏర్పడిన పాజిటివ్ బజ్‌కు పవన్ కల్యాణ్ ఆశీర్వాదాలు కలవడం చిత్ర బృందానికి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.



Show Full Article
Print Article
Next Story
More Stories