Kiara Advani: తల్లి కాబోతున్న కియారా.. ఫొటోతో గుడ్ న్యూస్ చెప్పిన దంపతులు

Kiara Advani Sidharth Malhotra Announce Pregnancy With a Cute Pic
x

తల్లి కాబోతున్న కియారా.. ఫొటోతో గుడ్ న్యూస్ చెప్పిన దంపతులు

Highlights

లీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని, సిద్దార్థ్ మల్హోత్రా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Kiara Advani: బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని, సిద్దార్థ్ మల్హోత్రా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండు చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫొటో పంచుకున్నారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో వస్తుంది అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా 2023లో వివాహం చేసుకున్నారు. జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. షేర్షా సినిమాలో వీళ్లిద్దరూ జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అయితే అప్పట్లో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. కానీ వీళ్లిద్దరూ కన్ఫర్మ్ చేయలేదు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్న కియారా.. రోమ్ నగరంలో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది.

పెళ్లైన నాలుగు నెలలకే కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలు నిజమే అనుకున్నారు అభిమానులు. అయితే ఆ వార్తలు అబద్ధమంటూ తర్వాత కియారా క్లారిటీ ఇచ్చారు. తాజాగా తాను తల్లి కాబోతున్నానంటూ ఒక ఫొటోను పంచుకుంది కియారా. ఈ విషయం తెలిసిన అభిమానులు సినీ సెలబ్రిటీలు కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన పోస్ట్ కింద రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. సమంత ఓ మై గాడ్ కంగ్రాచ్యులేషన్స్ అని కామెంట్ చేసింది.

ఫగ్లీ సినిమాతో వెండితెరకు పరిచయమైన కియారా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఇక తెలుగులోనూ నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించారు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ, ఇటీవల వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాల్లోనూ సందడి చేశారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ మూవీతో పాటు హిందీ వార్2లో నటిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories