నార్త్ ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న "కే జి ఎఫ్: చాప్టర్ 2"

KGF Chapter 2 Sets New Records in North India
x

నార్త్ ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న "కే జి ఎఫ్: చాప్టర్ 2"

Highlights

*నార్త్ ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న "కే జి ఎఫ్: చాప్టర్ 2"

KGF Chapter 2: కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన సినిమా "కే జి ఎఫ్: చాప్టర్ 2". ఒకవైపు కన్నడలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా హవా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా నార్త్ ఇండియాలో భారీ కలెక్షన్లు నమోదు చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా 400 కోట్ల మార్క్ ను దాటిన రెండవ సినిమాగా రికార్డుల్లో నిలిచింది. బాహుబలి 2 సినిమా తర్వాత 511 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకున్న "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా రెండవ స్థానంలో నిలిచింది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన "దంగల్" సినిమా లైఫ్ టైం కలెక్షన్లు కూడా కేవలం 387 కోట్లు మాత్రమే. ఆ సినిమా మూడవ స్థానంలో ఉంది. కానీ "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా దంగల్ లైఫ్ టైం కలెక్షన్ కేవలం మూడు వారాల్లోనే దాటేసింది.

మరో 100 కోట్లు కలెక్షన్లు నమోదు చేసుకుంటే ఈ సినిమా బాహుబలి రికార్డులను కూడా తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ విడుదల అయినప్పటికీ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరి "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories