యశ్ దున్నేసాడు..కేఫీఎఫ్ చాప్టర్‌ 2 వచ్చేసింది

యశ్ దున్నేసాడు..కేఫీఎఫ్ చాప్టర్‌ 2 వచ్చేసింది
x
Kgf 2
Highlights

దక్షిణ చలన చిత్రసీమలో కేఫీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దక్షిణ చలన చిత్రసీమలో కేఫీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లు వసూళ్లు సాధించింది. కన్నడ చిత్ర సీమతో పాటు సౌత్‌ ఇండస్ట్రీ స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ హీరోగా నటించారు. ఈ సినిమా ద్వారా కన్నడ స్టార్ యశ్ జాతీయ స్థాయిలో గుర్తిపు పొందారు. ఈ చిత్రం 2018లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.


అయితే తాజాగా చిత్రానికి సీక్వేల్‌గా కేజీఎఫ్ చాప్టర్‌ 2 సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 2020లో మేలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృదం ప్రయత్నాలు చేస్తుంది. కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 శుక్రవారానికి విడుదలై సంవత్సరం కావడంతో కేజీఎఫ్ చాప్టర్‌ 2 పోస్టర్‌ను విడుదల చేశారు. యశ్‌ ఓ పెద్ద స్తంభాన్ని లాగుతూ.. సామ్రాజ్యం రిబుల్డింగ్ అంటూ కేజీఎఫ్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైనా ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాను మరింత పెంచేలా కనిపిస్తుంది. బాలీవుడ్‌ కథానాయకుడు సంజయ్‌ దత్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. రవి బాసుర్‌ సంగీతం సమకూర్చారు. శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories