"కే జి ఎఫ్ 2" సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్

KGF Chapter 2 Has Sold The Most Tickets On BookMyShow | Movie News
x

"కే జి ఎఫ్ 2" సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్

Highlights

* "కే జి ఎఫ్ 2" సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్

KGF Chapter 2: కన్నడ స్టార్ యష్ హీరోగా "కే జి ఎఫ్: చాప్టర్ 1" వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా "కే జి ఎఫ్: చాప్టర్ 2" సూపర్ హిట్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించింది. చరిత్ర స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది.

ప్రముఖ ఆన్లైన్ సినిమా టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఒక భారీ రికార్డును నమోదు చేసుకున్నట్లు సమాచారం.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుక్ మై షో లో ఏకంగా 70 మిలియన్ కి పైగా టికెట్లు నమోదు చేసిందట. ఇది ఒక రికార్డ్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థమైపోతుంది.

రవి బస్రుర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని హాంబలే ఫిల్మ్స్ వారు నిర్మించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించారు. రవీనా టాండన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే కే జి ఎఫ్ చాప్టర్ 3 కూడా త్వరలో పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో యశ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories