"బాహుబలి 2" రికార్డులను బ్రేక్ చేస్తున్న "కేజిఎఫ్ 2"

KGF Chapter 2 Breaks Baahubali 2 Records | Telugu Movie News
x

"బాహుబలి 2" రికార్డులను బ్రేక్ చేస్తున్న "కేజిఎఫ్ 2" 

Highlights

*"బాహుబలి 2" రికార్డులను బ్రేక్ చేస్తున్న "కేజిఎఫ్ 2"

KGF-2 Vs Bahubali-2: కన్నడలో రాకింగ్ స్టార్ హీరోగా నటించిన "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. కన్నడ "బాహుబలి" గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా మిగతా భాషల్లో కూడా రికార్డుల వర్షం సృష్టించింది. ఇక తాజాగా ఆ సినిమాకి సీక్వెల్గా "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

కలెక్షన్ల పరంగా "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా "బాహుబలి 2" సినిమా ని కూడా దాటేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీలో "బాహుబలి 2" సినిమా కి 200 కోట్ల మార్క్ ను చేరుకోవడానికి ఆరు రోజులు పట్టింది కానీ బాలీవుడ్ లో "కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా కేవలం ఐదు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరి పోయింది.

ఇప్పటిదాకా ఏ హిందీ సినిమా కూడా సృష్టించలేని ఆ రికార్డు కన్నడ సినిమా అయిన "కే జి ఎఫ్: చాప్టర్ 2" బాలీవుడ్లో సృష్టించింది. ఇక మొదటి వారాంతం పూర్తయినప్పటికీ ఇంకా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పెడుతున్న ఈ సినిమా మహారాష్ట్ర, గుజరాత్ వంటి మాస్ సెంటర్ ల లో కూడా మంచి కలెక్షన్లు అందుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories