Vijay Devarakonda: సరికొత్త పాత్రలో విజయ్‌ దేవరకొండ?

Key update on Sukumar-Vijay Devarakonda film
x

విజయ్ దేవరకొండ, సుకుమార్(ఫొటో ట్విట్టర్)

Highlights

సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. 'రంగస్థలం' సక్సెస్‌ తరువాత వెనుదిరిగి చూడడం లేదు ఈ క్రేజీ డైరెక్టర్.

Vijay Devarakonda: సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. 'రంగస్థలం' సక్సెస్‌ తరువాత వెనుదిరిగి చూడడం లేదు ఈ క్రేజీ డైరెక్టర్. ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. అలాగే యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సుకుమార్‌ ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

తాజా నివేదికల మేరకు, సుకుమార్.. విజయ్ సినిమాకు స్టోరీని సిద్ధం చేశాడని తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న సమయాన్ని ఈ క్రేజీ సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు సినిమా స్క్రిప్ట్ పని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడంట. సుకుమార్ గతంలో చూపించని విధంగా ఈ సినిమాను తీయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

అలాగే, విజయ్ దేవరకొండ కూడా ఇది వరకు పోషించని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్ర ఎంటనేది మాత్రం బయటకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories