OTT Movie: ఫ్రెండ్స్ మాటలు విని భార్యపై అలాంటి పనులు చేసే భర్త.. చివరకి ఆమె ఏం చేసిందంటే ?

Kettyolaanu Ente Malakha A Romantic Drama That Explores Marriage and Self-Discovery Now Streaming on Amazon Prime Video
x

OTT Movie: ఫ్రెండ్స్ మాటలు విని భార్యపై అలాంటి పనులు చేసే భర్త.. చివరకి ఆమె ఏం చేసిందంటే ?

Highlights

OTT Movie: ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కోసం చాలా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేశారు.

OTT Movie: ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కోసం చాలా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేశారు. థియేటర్లకు వెళ్లకుండానే ఓటీటీలో నచ్చిన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మలయాళం సినిమాలపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. ఆ సినిమా కథలు డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో మూవీ చాలా డిఫరెంట్ గా తెరకెక్కింది. పెళ్లి అయినా కూడా భార్యతో గడిపేందుకు ఇబ్బంది పడే భర్త చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది.

ఈ మూవీ పేరు ‘కెత్యోలాను ఎంత మాలాఖా’ (Kettyolaanu Ente Malakha). 2019 సంవత్సరంలో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ నిస్సామ్ బషీర్ డైరెక్షన్లో వచ్చింది. ఇందులో ఆసిఫ్ అలీ, వీణా నందకుమార్, జాఫర్ ఇడుక్కి, బాసిల్ జోసెఫ్, షైన్ టామ్ చాకో వంటి వారు నటించారు. విలియం ఫ్రాన్సిస్ ఈ మూవీకి సంగీతం అందజేశారు. కొత్తగా పెళ్లయిన స్లీవచన్, రిన్సీ వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలతో కథ నడుస్తుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళితే.. హీరోకు మొదటినుంచి అమ్మాయిలంటే కాస్త బెరుకు ఎక్కువ. వాళ్లకు చాలా దూరంగా ఉంటాడు. తనకి నలుగురు అక్కలు ఉంటారు. వాళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయిన గానీ ఒంటరిగానే ఉంటాడు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ జాలీగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఒకరోజు హీరో తల్లి అనారోగ్యంతో బాధపడుతూ స్పృహ లేకుండా పడిపోతుంది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన హీరో తల్లిని చూసి కంగారుపడి ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అక్క లందరూ హీరోని పట్టుకుని బాగా తిడతారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.

ఈ క్రమంలోనే చర్చ్ ఫాదర్ కి తెలిసిన ఒక ఫ్యామిలీలో అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్తారు. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరి ఉంటుంది. అయితే హీరో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడి, హీరోయిన్ తల్లితో కూడా మంచిగా మాట్లాడుతాడు.. హీరోయిన్ తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద పడి ఉంటుంది. తనని చూసి తన తల్లిని కూడా అలా చూసుకుంటుంది నా భార్య అనుకుంటూ పెళ్లికి ఒకే చెప్పేస్తాడు.

ఆ తర్వాత వీళ్లకు పెళ్లి జరిగిపోతుంది. ఇంటికి వచ్చిన భార్యతో గడిపేందుకు బాగా భయపడుతూ ఉంటాడు. హనీమూన్ కు ప్లాన్ చేసినా, అక్కడ కూడా తనతో గడపడానికి మొహమాటపడతాడు. వాస్తవానికి హీరోకు తన భార్యతో ఎలా గడపాలో తెలియదు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉండడంతో ఈ సమస్య ఎదురవుతుంది. ఒకరోజు ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో బాగా తాగి రెచ్చిపోతాడు. దీంతో స్పృహ కోల్పోతుంది హీరోయిన్. ఇంట్లో ఉన్నవాళ్లు హీరోను బాగా తిడతారు. తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్ మెంట్ కూడా చేయిస్తాడు. ఆ తర్వాత హీరో భార్యని ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ తన ప్రేమని కూడా వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. చివరకి హీరో తన భార్యకు ప్రేమను వ్యక్తం చేస్తాడా అన్న విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories