Actress Sukriti Ambati: కేరింత హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? అదే క్యూట్‌నెస్‌

Kerintha Actress Sukriti Ambati Where is She Now? See Her Latest Viral Pics
x

Actress: కేరింతలో నటించిన ఈ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా? అదే క్యూట్‌నెస్‌ 

Highlights

Actress Sukriti Ambati: కేరింత.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు అందరూ కొత్త...

Actress Sukriti Ambati: కేరింత.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు అందరూ కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఈ సినిమాకు సాయి కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విశ్వంత్ దుడ్డుంపూడి, సుమంత్ అశ్విన్, పార్వతీశం, తేజస్వి మదివాడ, సుకృతి అంబటి, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా ద్వారా తేజస్వీ, శ్రీదివ్య, అశ్విన్‌లకు మంచి గుర్తింపు లభించింది. యూత్‌‌ఫుల్‌ ఎంటర్‌‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరో హీరోయిన్‌ కూడా పరిచయమైంది. ఈ చిత్రంలో పార్వతీశంకు జోడీగా నటించిన సుకృతి అంబటే ఆ హీరోయిన్‌. ఈ మూవీలో తనదైన నటన, అందంతో కుర్రకారును ఫిదా చేసిందీ బ్యూటీ. తన క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. దీంతో తెలుగులో సుకృతికి వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. అయితే సీన్‌ దీనికి రివర్స్‌గా జరిగింది.

కేరింత సినిమా తర్వాత సుకృతి మరో సినిమాలో నటించలేదు. ఈ చిత్రంలో భావన పాత్రతో ఆకట్టుకున్న సుకృతి ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. పెళ్లి చేసుకుని సెటిల్‌ అయ్యింది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

సుకృతి వ్యక్తిగత జీవితానికి వస్తే.. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలోనే పెరిగింది. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాతే కేరింత మూవీలో నటించింది. ప్రస్తుతం సినిమాలు దూరంగా కుటుంబంతో కలిసి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories