Kerala Crime Files Season 2: స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన మ‌ల‌యాళి క్రైమ్ డ్రామా.. ఎప్ప‌టి నుంచంటే

Kerala Crime Files Season 2
x

Kerala Crime Files Season 2: స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన మ‌ల‌యాళి క్రైమ్ డ్రామా.. ఎప్ప‌టి నుంచంటే

Highlights

Kerala Crime Files Season 2: మలయాళంలో రూపొందిన క్రైమ్ డ్రామా కేర‌ళ క్రైమ్ ఫైల్స్ మరోసారి థ్రిల్లింగ్ మిస్టరీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘Kerala Crime Files Season 2 – The Search for CPO Ambili Raju’ పేరుతో రూపొందిన ఈ సీజన్ జూన్ 20 నుంచి జియోహాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.

మొదటి సీజన్‌లో ఎర్నాకులంలో జరిగిన ఓ హత్య కేసును విచారించిన పోలీసుల కథను చూపించారు. ఇప్పుడు సీజన్ 2 కథ తిరువనంతపురంకు మారుతుంది. ఇందులో CPO అంబిలి రాజు అనే పోలీసు అధికారి అచూకీ కోసం క‌థం సాగుతుంది. ఈ పాత్రలో ప్రముఖ నటుడు ఇంద్రన్స్ నటించారు.

పోలీస్ వ్యవస్థలో అంతర్గత సంక్షోభం?

ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ల ప్రకారం, ఈ సీజన్ కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ అదృశ్యమవడం గురించే కాదు. తిరువనంతపురం జిల్లాలో 5 మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, 12 మంది సివిల్ పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అవడం ద్వారా పోలీస్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న నిజాలను వెల్లడించే ప్రయత్నమే ఈ సీజన్‌లో ఉంటుంది.

అహ‌మ్మ‌ద్ ఖ‌బీర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సిరీస్‌కు బాహుల్ రమేష్ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించ‌గా బాహుల్ రమేష్ సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. ఇక న‌టీన‌టుల విష‌యానికొస్తే ఇందులో అర్జున్ రాధాకృష్ణన్, అజు వర్గీస్, లాల్, ఇంద్రన్స్, హరిశ్రీ ఆసోకన్, రెంజిత్ శేఖర్, సంజు సనిచన్, సురేష్ బాబు, నవాస్ వల్లికున్ను తదితరులు న‌టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories