పెళ్లిచేసుకోవాలని కీర్తికి కుంటుంబం నుంచి ఒత్తిడి..? వరుడు ఎవరంటే

పెళ్లిచేసుకోవాలని కీర్తికి కుంటుంబం నుంచి ఒత్తిడి..? వరుడు ఎవరంటే
x
Highlights

కరోనా లాక్ డౌన్ సమయంలో చాలామంది సినీనటులు పెళ్లి పీఠలెక్కారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కాజల్, నిహారిక ఏడడుగులు వేశారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో చాలామంది సినీనటులు పెళ్లి పీఠలెక్కారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కాజల్, నిహారిక ఏడడుగులు వేశారు. ఇప్పుడు అదేబాటలో మళయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ కూడా పయనించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లోకి 'నేను శైలజా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. 'మహానటి' చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె పెళ్లి పీఠలు ఎక్కుతున్నారనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. కీర్తి పెళ్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో జరగనుందంటూ ఈ ఏడాది మొదట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవన్నీ అవాస్తవమని అప్పట్లో కీర్తిసురేశ్ ఖండించారు.

కాగా.. మరోసారి కీర్తి పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కీర్తికి త్వరలోనే పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ మేరకు నటిపై ఒత్తిడి తీసుకువస్తున్నారట. దీంతో కీర్తి సురేశ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని.. ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి ఉంచానని కుటుంబసభ్యులతో చెప్పారని ఆంగ్ల వార్త పత్రికల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కీర్తి పెళ్లి ఇప్పట్లో లేనట్లే అని నెటిజన్లు సైతం పోస్టులు పెడుతున్నారు.

ప్రముఖ నటి మేనక కుమార్తెగా.. సిల్వర్ స్రీన్ కు పరిచయమైయ్యారు కీర్తిసురేశ్‌ తొలుత కొన్ని మలయాళీ సినిమాల్లో బాలనటిగా నటించారు. 'ఇడు ఎన్నా మాయం' అనే తమిళ చిత్రంలో తొలిసారి ఆమె హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా కొన్ని కారణాలతో విడుదల కాలేదు. ఈ ఏడాది పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలతో సినీఅభిమానులను పలకరించింది. అయితే ఆ చిత్రాలు పెద్దగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కీర్తి సురేశ్ సుపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారువారి పాట'లో చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories