"18 పేజెస్" కంటే ముందే విడుదల కాబోతున్న కార్తికేయ 2

Karthikeyan 2 Movie to Be Released Before 18 Pages Movie
x

"18 పేజెస్" కంటే ముందే విడుదల కాబోతున్న కార్తికేయ 2

Highlights

*"18 పేజెస్" కంటే ముందే విడుదల కాబోతున్న కార్తికేయ 2

Nikhil Movies: ఒకప్పుడు సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసే నిఖిల్ సిద్ధార్థ్ ఈమధ్య కాలంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. 2019లో "అర్జున్ సురవరం" సినిమా తో కనిపించిన నిఖిల్ ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది లేదు. అయితే నిఖిల్ చేతిలో మాత్రం రెండు మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి తన సూపర్ హిట్ సినిమా కార్తికేయ కి సీక్వెల్గా తెరకెక్కనున్న "కార్తికేయ 2". మరొకటి "18 పేజెస్".

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న 8 పేజెస్ సినిమాకి "కుమారి 21ఎఫ్" ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా కార్తికేయ 2 సినిమా జూలై 22న థియేటర్లలో విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు.

కానీ "18 పేజెస్" చిత్రబృందం మాత్రం సినిమా విడుదల తేదీ గురించి ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమా వేసవిలో విడుదల అవుతుంది ఈ కొందరు అంటున్నారు కానీ అధికారిక విడుదల తేదీ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈనేపథ్యంలో "18 పేజెస్" సినిమా కంటే "కార్తికేయ 2" సినిమానే ముందుగా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories