దొంగ చిత్రం సాంగ్ రిలీజ్..అదిరిపోయే రెస్పాన్స్

దొంగ చిత్రం సాంగ్ రిలీజ్..అదిరిపోయే రెస్పాన్స్
x
Donga Movie
Highlights

తమిళ కథానాయకుడు కార్తీకి తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. కార్తీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.

తమిళ కథానాయకుడు కార్తీకి తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. కార్తీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇటీవలె విడుదలైన ఖైదీ చిత్రంతో హిట్ కొట్టిన కార్తీ మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళ చిత్రం తంబిని చిత్రం దొంగ పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. కాగా.. దొంగ చిత్రానికి సంబంధించి టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈనాడు పండుగే పండగే అనే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జోసెష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ నిఖిలా రామన్ కార్తి సరసన నటిస్తుంది. మరో హిరోయిన్ కార్తి వదిన జ్యోతిక కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. సత్యరాజ్ అన్సల్, అమ్మూ అభిరామి, షావుకారు జానకి పలువురు నటీనటులు ఈ చిత్రంలో ఉన్నారు.

యాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్ ప్రొడక్షన్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం విడుదల చేసిన ఈ పాట రామజోగయ్య శాస్త్రి రచనను అందించగా రంజిత్ గోవింద్ అద్భుతమైన బాణీలు అందించారు. ఈ పాటలో కార్తీ మాస్ లూక్ తో కనిపిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు, తమిళంతోపాటు పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కార్తీతోపాటు అతని వదిన నటుడు సూర్య భార్య నటించడం విశేషం


Show Full Article
Print Article
More On
Next Story
More Stories