అభిమాని మరణ వార్త విని కన్నీళ్లు పెట్టిన కార్తి

అభిమాని మరణ వార్త విని కన్నీళ్లు పెట్టిన కార్తి
x
అభిమాని భౌతికకాయం వద్ద కార్తీ
Highlights

ఖైదీ సినిమాతో సూపర్‍ ‍హిట్ కొట్టారు కార్తి. ప్రస్తుతం కార్తి తంబి సినిమాతో బిజీగా ఉన్నారు.

ఖైదీ సినిమాతో సూపర్‍ ‍హిట్ కొట్టారు కార్తి. ప్రస్తుతం కార్తి తంబి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో నటీ కార్తి వదిన జ్యోతిక, సత్యరాజ్ కూడా నటిస్తున్నారు. జీతు జోసఫ్ ఈ చిత్రాన్నికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు వస్తుంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటను విడుదల చేశారు. అంతకుముందు కార్తి తన అభిమాని మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. చైన్నెకు చెందిన కార్తి అభిమాని వ్యసాయ్ రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యసాయ్ శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న హీరో కార్తి అభిమాని సొంతూరు ఉళుండూరుపేటకు వెళ్లారు. అభిమాని మృతదేహాన్ని చూసి కార్తి కన్నీరు పెట్టుకున్నారు.

కార్తి అభిమాని వ్యసాయ్ నిత్య కార్తి ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించి ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారు. దీంతో కార్తికి వ్యసాయ్ అంటే చాలా ఇష్టం. అనంతరం వ్యసాయ్ కుంటుంబీకులను కార్తి పరామర్శించారు. వారికి ఏలాంటి సహాయం కావాలన్న అందుకుంటానని హామి ఇచ్చారు. దీంతో ఉళుండూరుపేట తంబి సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు వెళ్లారు. ఆ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనైయ్యారు. కార్తికి సన్నిహితంగా ఉండే అభిమాని కోల్పోవడంలో కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories