సీనియర్ నటి కి కౌంటర్ ఇచ్చిన కార్తి

సీనియర్ నటి కి కౌంటర్ ఇచ్చిన కార్తి
x
Highlights

ఇంతకుముందు సెలబ్రిటీలు కనబడితే ఆటోగ్రాఫ్ కోసం వెనకబడే జనాలు స్మార్ట్ ఫోన్ ల పుణ్యమా అని సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు చాలా...

ఇంతకుముందు సెలబ్రిటీలు కనబడితే ఆటోగ్రాఫ్ కోసం వెనకబడే జనాలు స్మార్ట్ ఫోన్ ల పుణ్యమా అని సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మధ్యనే కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయనకు తెలియకుండా గబుక్కున వచ్చి ఆయనతో సెల్ఫీ తీయడానికి ఒక ఫ్యాన్ ప్రయత్నిస్తే శివ కార్తికేయన్ అతని ఫోన్ తీసి నేల మీదకు విసిరి కొట్టిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా కార్తీతో ఫోటో దిగుతూ ఒక సీనియర్ నటి ఆ విషయంపై జోకేసింది.

'జులై కాట్రిల్' అనే సినిమా ఆడియో లో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చాడు కార్తి. అదే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది కస్తూరి. కార్తీ తో సెల్ఫీ దిగడానికి కార్తీ వద్దకు వచ్చిన ఆమె "పక్కన శివ కుమార్ గారు లేరు కదా?" అంటూ జోకేసింది. జోకు మంచిదే కానీ కొందరికి మాత్రమే నవ్వొచ్చింది. శివకుమార్ తనయుడైన కార్తీ కి మాత్రం కోపం వచ్చింది. "సెల్ఫీ తీసుకోవాలనుకోవడం మంచిదే కానీ సెలబ్రిటీలను నెట్టడం, సెల్ఫి కోసం ఫోను ను వారి మొహానికి అడ్డంగా పెట్టడం ఎంత వరకూ కరెక్ట్?" అన్నాడు కార్తీ. ఇలా ఆమె కు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు కార్తీ.

Show Full Article
Print Article
Next Story
More Stories