దొంగ : ట్విట్టర్‌ రివ్యూ

దొంగ : ట్విట్టర్‌ రివ్యూ
x
Donga
Highlights

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు తమిళ హీరో కార్తీ. హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తీ మంచి సినిమాలు చేసుకుంటూ నటుడుగా తనకంటూ...

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు తమిళ హీరో కార్తీ. హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన కార్తీ మంచి సినిమాలు చేసుకుంటూ నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.. ఇటీవలే 'ఖైదీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీ తాజాగా 'దొంగ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తమిళంలో 'తంబి'గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో 'దొంగ'గా విడుదల చేశారు. ఈ సినిమాని కార్తీ, జ్యోతిక కలిసి చేస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు దృశ్యం ఫేం జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమా పైన మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో సత్యరాజ్, నిఖిల, ఆన్సన్, షావుకారు జానకి, సీత ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంస్థలు నిర్మించాయి.

ఈ సినిమా చూసినవాళ్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. అయితే, ఇందులో ఎక్కువ మంది తమిళ ప్రేక్షకులే ఉన్నారు. అయితే సినిమాకి ఎక్కువగా మిక్సుడ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. కొందరు బాగుందంటే మరికొందరు బాలేదని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమాకి సత్యరాజ్ పాత్ర హైలెట్ గా చెబుతున్నారు. సినిమా మొత్తంలో ఆయన నటన అద్భుతం అని కొనియాడుతున్నారు.

మొదటిభాగం బాలేదని, రెండవ భాగం మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాకి చాలా ప్లస్ అయ్యాయని అంటున్నారు. ఇక మరోవైపు మాత్రం ఖైది లాంటి మంచి హిట్టు తర్వాత కార్తీ చేయాల్సిన సినిమా కాదని, పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాపైన ఎలాంటి స్పష్టత అయితే లేదు. చూడాలి మరి ఈ సినిమా కార్తీకి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories