దొంగ సినిమా రివ్యూ: ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు

దొంగ సినిమా రివ్యూ: ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు
x
Highlights

తమిళ హీరో కార్తీ ఖైదీ చిత్రం ఇచ్చిన విజయంతో మరోసారి తెలుగులో దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తమిళ హీరో కార్తీ ఖైదీ చిత్రం ఇచ్చిన విజయంతో మరోసారి తెలుగులో దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీ తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విధ్యమైన సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకు మనసు గెలుచుకున్నారు.ఆయన నటించిన చిత్రాలన్ని తెలుగులోనూ అనువాదమవుతున్నాయి. యుగానికి ఒక్కడు చిత్రంలో పరిచయమై దొంగ సినీమా వరకూ అన్ని విభిన్న పాత్రలే. ఖాకీ, ఖైదీ, ఇలా వరస బ్లాక్ బస్టర్లతో తెలుగు ఇండస్ట్రీ దున్నేస్తున్నారు. తాజాగా విడుదలైన దొంగ చిత్రం ప్రేక్షకుల మనస్సు దొచుకుందా లేదా చూద్దాం?

తమిళంలో తంబి చిత్రం తెలుగు అనువాదమే దొంగ‎ చిత్రం. ఈ చిత్రానికి దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్తీ వదిన నటుడు సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటించారు. సత్యరాజ్, నిఖిల, షావుకారు జానకి పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

కథ :

హీరో విక్కీ(కార్తీ) గోవాలో దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఉంటాడు. 15ఏళ్లు క్రితం తప్పిపోయిన కుమారుడు శర్వా కోసం తండ్రి జ్ఞాన మూర్తి(సత్య రాజ్) వెతుకుతుండాడు. అక్క పార్వతి(జ్యోతిక)వాళ్ళ కుటుంబంలోకి గోవా పోలీస్ ఆఫీసర్ జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీని శర్వాగా తీసుకొస్తాడు. అయితే శర్వాగా వెళ్లిన విక్కీ జ్ఞాన మూర్తి కుటుంబంలో ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి? ఆ కుటుంబం శర్వాగా అతడిని నమ్మిందా? శర్వా ఎక్కిడి వెళ్లాడు? అనేది విగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఖైదీ లాంటి హిట్ అందుకున్న కార్తీ తన దొంగ చిత్రం కూడా అదే జోనర్ లో తీశాడు. డబ్బుల కోసం దొంగ శర్వాగా కొడుకుగా ప్రవేశిస్తాడు, కార్తీ నటన ఆకట్టుకుంది. మొదటి భాగంలో కార్తీ కామెడీ టైమింగ్ తో నవ్వులుపూయిస్తారు, ఇంటర్వల్ తర్వాత మొత్తం యాక్షన్ ,ఎమోషన్స్ తో రక్తికట్టిస్తాడు.

శర్వా తండ్రి పాత్రలో సత్యరాజ్ ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. ఆయన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశారు. కార్తీ అక్క పాత్ర జ్యోతిక క్లైమెక్స్ సన్నివేశాలలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. నిఖిల విమల్ నటన సహజంగా ఉంది. సెకండ్ హాఫ్ లో నిఖిల విమల్ పాత్రకు ప్రాధాన్యం లేకుండా పోయింది. గోవా పోలీస్ అధికారిగా ఇళవరసి మెప్పించారు.

కొంచెం స్లోగా దొంగ మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో కామెడీ టైమింగ్, సెకండ్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ‎ఉన్నాయి. అసలు శర్వా ఏమాయ్యాడు అనే సన్నివేశాలతో క్లైమాక్స్ వరకు కథ సాగినా మూవీ ఎక్కడా బోరుకొట్టదు.ఇంటర్వేల్ ముందు ట్విస్ట్ అలాగే క్లైమాక్స్ ఎండ్ విధానం ఆసక్తిగా రేకేత్తిస్తాయి. ఇరత ముఖ్య పాత్రలలో జానకీ, సీత ఆకట్టుకున్నారు.


మైనస్ పాయింట్స్

ట్రైలర్ చూసి అక్క జ్యోతిక, తమ్ముడు కార్తీల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులు భావిస్తారు. కానీ, సినిమా పూర్తిగా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్. జ్యోతిక పాత్ర ఫస్ట్‌ఆఫ్‌లో ప్రాధాన్యం లేదు. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని సన్నివేశాలకే పరిమితం చేశారు. అతడు సినిమా షేడ్స్ ఫస్ట్‌ఆఫ్‌ సాగుతుంది‎. సెకండ్ హాఫ్‌లో ఫన్ ఎలిమెంట్స్ మిస్ కావడం, హీరోయిన్ కేవలం ఫస్ట్‌ఆఫ్‌ పరిమితం కావడం మైనెస్ పాయింట్స్.

గోవింద వసంత పాటలు ఆకట్టుకున్నాయి. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నీవేశాలు కెమెరాలో బంధించిన తీరు ఆకట్టుకుంటుంది. వి ఎస్ వినాయక్ ఎడిటింగ్ పరవాలేదు.జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే సినిమాకే ప్రధాన ఆకర్షణ. దర్శకుడు జీతూ జోసెఫ్ క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. ఒక చిన్న పాయింట్ చుట్టూ సస్పెన్సు కథ నడిపిన విధానం బాగుంది. ఎక్కడ రాజీ లేకుండా నిర్మించారు.

మొత్తంగానికి క్రైమ్, సస్పెన్సు థ్రిల్లర్‌గా వచ్చిన దొంగ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories