దొంగ : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్లు కొల్లగొట్టాడా?

దొంగ : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్లు కొల్లగొట్టాడా?
x
karthi donga movie
Highlights

కార్తీ గత చిత్రం ఖైదీ తెలుగులో అనువాదం అయింది అయితే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో థియేటర్లను కేటాయించారు.

తమిళ హీరో కార్తీ ఖైదీ చిత్రం ఇచ్చిన విజయంతో మరోసారి తెలుగులో దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీ తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విధ్యమైన సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకు మనసు గెలుచుకున్నారు.ఆయన నటించిన చిత్రాలన్ని తెలుగులోనూ అనువాదమవుతున్నాయి. యుగానికి ఒక్కడు చిత్రంలో పరిచయమై దొంగ సినీమా వరకూ అన్ని విభిన్న పాత్రలే. ఖాకీ, ఖైదీ, ఇలా వరస బ్లాక్ బస్టర్లతో తెలుగు ఇండస్ట్రీ దున్నేస్తున్నారు. తాజాగా విడుదలైన దొంగ బాక్సాఫీసు ముందు ఖైదీ చిత్రం రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయా లేదో చూద్దాం?

తమిళంలో తంబి చిత్రం తెలుగు అనువాదమే దొంగ‎ చిత్రం. ఈ చిత్రానికి దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్తీ వదిన నటుడు సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటించారు. సత్యరాజ్, నిఖిల, షావుకారు జానకి పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

కార్తీ గత చిత్రం ఖైదీ తెలుగులో అనువాదం అయింది అయితే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో థియేటర్లను కేటాయించారు. ఖైదీ సినిమా విడుదల సమయంలో తెలుగులో పెద్ద హీరో చిత్రాలులేవీ విడుదల కాలేదు. దీంతో ఖైదీ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే దొంగ సినిమాకు అటూ టావీవుడ్ అగ్రకథానాయకుడు బాలకృష్ణ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ రూలర్. మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే, దబాంగ్ -3లాంటి అనువాద సినిమాలు రేసులో ఉన్నాయి.

కాగా, బడా సినిమాలు పోటీ ఉండడంతో దొంగకు సినిమాకు థియేటర్లు సంఖ‌్య తగ్గిపోయింది. ఈ చిత్రానికి తక్కవ మొత్తంలో థియేటర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. దొంగ చిత్రం బాగుందని టాక్ వచ్చినా థియేటర్ల సమస్య ఇబ్బంది పెట్టింది. దీంతో దొంగ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20-25లక్షలు వసూళ్ల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

దృశ్యం సినిమాతో హిట్ కొట్టిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కడం అంతే కాకుండా, ఖైదీ లాంటి సంచలన విజయం తర్వాత కార్తీ నుంచి వస్తున్న మరో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఖైదీ విడుదలకు ఇతర సినిమాలు పోటీ ఉండడంతో 3.5కోట్ల మేర బిజినెస్ మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. దొంగ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ సాధించాలంలే కనీసం రూ.4 కోట్లు రాబట్టాల్సిందే.

l

Show Full Article
Print Article
More On
Next Story
More Stories