HIT Movie: హిట్‌ 4లో హీరో ఎవ‌రో తెలిసిపోయింది.. ఏసీపీ వీరప్పన్‌గా ఆ హీరో

HIT Movie
x

HIT Movie: హిట్‌ 4లో హీరో ఎవ‌రో తెలిసిపోయింది.. ఏసీపీ వీరప్పన్‌గా ఆ హీరో

Highlights

HIT Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం హిట్ 3 ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

HIT Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం హిట్ 3 ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విషయం తెలిసిందే. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నాని నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నాయ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే 'హిట్‌' ఫ్రాంచైజ్‌లో ఇది మూడో సినిమా. విశ్వక్ సేన్ ‘హిట్ 1’, ఆ తర్వాత అడివి శేష్ ‘హిట్ 2’లో నటించగా, ఇప్పుడు నాని 'హిట్ 3'కు హీరోగా నిలిచాడు. ప్రతి పార్ట్‌లోని క్లైమాక్స్‌లో తదుపరి సినిమా హీరోను పరిచయం చేయడం ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ క్రమంలో ‘హిట్ 3’ ముగింపు సమయంలో హిట్-4లో కోలీవుడ్ స్టార్ కార్తీని హీరోగా ప్రకటించారు. అతను ఏసీపీ వీరప్పన్ పాత్రలో కనిపించనున్నాడు.

గతంలో ‘సిరుత్తై’, ‘ఖాకీ’ వంటి సినిమాల్లో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలు పోషించిన కార్తీ ఈసారి హిట్ సిరీస్‌లో సందడి చేయబోతున్నాడు. హిట్‌3 విడుద‌ల‌కు ముందే కార్తీకి సంబంధించి కొన్ని లీకులు వ‌చ్చాయి. దీనిపై ద‌ర్శ‌కుడు అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అయితే చివ‌రి వ‌ర‌కు చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని స‌స్పెన్స్‌గా ఉంచింది.

ఇదిలా ఉంటే 'హిట్' సిరీస్ మొత్తంగా 8 భాగాలుగా రూపొందనుందని దర్శకుడు శైలేష్ కొలను ఓ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అంటే, హిట్-4తో పాటు, హిట్-5 నుంచి హిట్-8 వరకు కూడా రాబోతున్నాయి. అంతేకాదు, హిట్ 8లో ఇప్పటికే వచ్చిన హిట్ హీరోలందరూ కలసి ఒకే స్క్రీన్ మీద కనిపించనున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories