Karisma Kapoor: మాజీ భర్తపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Karisma Kapoor Sensational Comments About Her Ex Husband Sanjay Kapoor
x

మాజీ భర్తపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Highlights

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Karisma Kapoor: సెలబ్రిటీల జీవితాలు పైకి అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. సౌత్‌తో పోలిస్తే నార్త్ లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్తులకు లైంగిక వేధింపులు ఎక్కువే. కొందరు.. సినిమాల పరంగా సమస్యలు ఎదుర్కొంటే.. మరికొందరు వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఫేజ్ చేసిన వారు ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇలాంటి విషయాలను బయటకు చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

కరిష్మా కపూర్ 1990లో తన అందచందాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊసేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. డ్యాన్స్‌లోనూ అందంలోనూ హీరోయిన్‌లకి గట్టి పోటీ ఇచ్చేవారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే కరిష్మా, సంజయ్ కపూర్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే అతనికి విడాకులిచ్చారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరిష్మా తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు.

తన భర్త మొదట బాగానే ఉండేవారని కానీ రాను రాను అతనిలో చాలా మార్పు వచ్చిందన్నారు. దాన్ని తాను అసలు ఊహించలేదని చెప్పారు. అతను ఎంతకు దిగజారారంటే.. తన స్నేహితుల వద్ద తనను వేలం వేసేవాడు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారితో తనను ఆ రోజు రాత్రి గడపాలని బలవంతం చేసేవారని అన్నారు. ఇలాంటి పనులు చేసి తనను హింసించేవాడని.. వాటిని భరించలేక అతని నుంచి విడాకులు తీసుకున్నానంటూ చెప్పుకొచ్చారు కరిష్మా.

Show Full Article
Print Article
Next Story
More Stories