Kareena Kapoor: ఇది మా కుటుంబానికి చాలా బ్యాడ్ డే : కరీనా కపూర్

Kareena Kapoor: ఇది మా కుటుంబానికి చాలా బ్యాడ్ డే : కరీనా కపూర్
x
Highlights

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గురువారం జరిగిన దాడి బాలీవుడ్ ను కుదిపేసింది. ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేశాడు....

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గురువారం జరిగిన దాడి బాలీవుడ్ ను కుదిపేసింది. ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై ఆయన భార్య కరీనాకపూర్ స్పందించారు. తమ కుటుంబానికి ఇది చాలా బ్యాడ్ అని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

మా ఫ్యామిలీకి ఇది ఎంతో సవాలుతో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కఠినమైన సమయంలో మద్దతుగా నిలిచనవారందరికీ కృతజ్ఞతలు. మీడియా, ఫ్రీలాన్సర్లు కొంచెం సంయమనం పాటించాలి. ఊహజనిత కథనాలు , కవరేజికి దూరంగా ఉండాలి. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇలాంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో నట్టేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

గురువారం తెల్లవారుజామున 2.30గంటలకు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది. సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు యత్నించిన క్రమంలో అతనిపై దాడి చేసిన పరారైనట్లు తెలుస్తోంది. కత్తిపోట్లకు గురైన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories