ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కరీనా కపూర్

Kareena Kapoor Gave Clarity About Prabhas Movie
x

ప్రభాస్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కరీనా కపూర్

Highlights

Kareena Kapoor: "స్పిరిట్" సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

Kareena Kapoor: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం "సాలార్" తో బిజీగా ఉన్న ప్రభాస్ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న సందీప్ వంగా డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి "స్పిరిట్" అనే టైటిల్ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇక ప్రభాస్ స్టార్ డం కి తగ్గట్టుగానే సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ప్యాన్ ఇండియన్ భాషలలో మాత్రమే కాకుండా విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

సినిమా గురించి సందీప్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోయినప్పటికీ సినిమా కథ గురించి హీరోయిన్ గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. అందులో ఒకటి బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అనే వార్త. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరీనాకపూర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ తో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని కానీ సందీప్ వంగా డైరెక్షన్లో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం ఆమెకు రాలేదని స్పష్టం చేసింది. మరి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించనున్నారు అని ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories