Kapata Nataka Sutradhari: ఆసక్తికరంగా 'కపటనాటక సూత్రధారి' ఫస్ట్ లుక్


కపటనాటక సూత్రధారి ఫస్ట్ లుక్ రిలీజ్ (ఫొటో ట్విట్టర్)
Kapata Nataka Sutradhari: సినిమాలో కంటెంట్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా ప్రేక్షకులు పట్టించుకోవడంలేదు.
Kapata Nataka Sutradhari: సినిమాలో కంటెంట్ ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా ప్రేక్షకులు పట్టించుకోవడంలేదు. కొత్త నటీనటులైనా కంటెంట్ ఉంటేనే హిట్ అవుతున్నాయి సినిమాలు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'కపటనాటక సూత్రధారి' సినిమా తీర్చిదిద్దుతున్నాడు క్రాంతి సైనా అనే డైరెక్టర్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మూవీ యూనిట్. అయితే, ఈ ఫస్ట్ లుక్ ను రచయిత కోన వెంకట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా, డిఫరెంట్ గా ఉంది. దీంతో ఈ సినిమా చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని, సినిమా తర్వగా చూడాలనే ఆసక్తిని కలిగిస్తుందని అన్నారు. అలాగే మూవి యూనిట్ కు ఆల్ దిబెస్ట్ చెప్పారు ఆయన.
ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ (హలీమ్) నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామన్నారు మేకర్స్.
Here's the Captivating First- Look Poster Of #KapataNatakaSutradhari Launched by @konavenkat99 Garu
— Vamsi Kaka (@vamsikaka) April 13, 2021
💰 : #Manish (Haleem)
🎬 : #KranthiSaina
🎼 : #RamTavva
📽️ : #SubhashDonti
✂️ : #Chotakprasad
Background Score : #VikasBadisa pic.twitter.com/6sA72KY1Xt

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



