"కేజీఎఫ్-2" ఒక మైండ్లెస్ సినిమా అంటున్నకాంతార నటుడు

Kantara Kishore Says he has Not Seen the Movie KGF 2
x

"కే జి ఎఫ్ 2" ఒక మైండ్లెస్ సినిమా అంటున్న కాంతార నటుడు

Highlights

*కే జి ఎఫ్ 2 సినిమా చూడలేదు అంటున్నా కాంతార కిషోర్

Kantara Kishore: 2022లో కన్నడ ఇండస్ట్రీ నుంచి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. అందులో మొదటిది యష్ నటించిన "కే జి ఎఫ్ 2". ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా నటించిన "కాంతార" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లను అందుకొని అందరికీ షాక్ ఇచ్చింది.

ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలను హోంబలే ఫిలింస్ వారు నిర్మించారు. ఈ రెండు సినిమాలతో నిర్మాతలు భారీ ప్రాఫిట్ లు అందుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "కాంతార" సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన కిషోర్ అనే నటుడు "కే జీ ఎఫ్ 2" గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. "కే జి ఎఫ్ 2" ఒక చెత్త సినిమా అని, అలాంటి సినిమా చూసే బదులు తాను చిన్నదైనా సరే ఒక సీరియస్ కథాంశం ఉన్న సినిమాని చూస్తానని చెప్పుకొచ్చారు కిషోర్. అంతేకాకుండా ఇప్పటిదాకా "కేజిఎఫ్ 2" సినిమాని తాను చూడలేదని స్పష్టం చేశారు.

కాంతార సినిమాలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రోల్‌ పోషించిన కిషోర్ మీడియాతో మాట్లాడుతూ "ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ ఓ నాకు తెలియదు. కానీ నేను కేజిఎఫ్ 2 సినిమాని చూడలేదు. అది నా టైప్ సినిమా కాదు. అది నా వ్యక్తిగత విషయం. అలాంటి ఓ మైండ్ లెస్ సినిమా కంటే సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఒక చిన్న సినిమా నైనా చూడటానికి ఇష్టపడతాను" అని అన్నారు. అసలు కన్నడ ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన "కేజిఎఫ్" వంటి సినిమా గురించి కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories