కళ్యాణ్ దేవ్ తో కన్నడ బ్యూటీ...

kalyan dev
x
kalyan dev
Highlights

కళ్యాణ్ దేవ్ సరసన కొత్త అమ్మాయి కనిపించనుంది. కన్నడలో స్టార్ హీరోలతో కలిసి పని చేసిన రచితా రామ్‌ను ఈ సినిమాలో కథానాయకగా ఎంపిక చేసారు.

విజేత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు..ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించనప్పటికీ నటుడుగా కళ్యాణ్ దేవ్ కి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వచ్చినప్పటికీ కథ ఎంపీకలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నాడు కళ్యాణ్ దేవ్.. అందులో భాగంగానే 'సూపర్ మచ్చి' అనే సినిమాని స్టార్ట్ చేసాడు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం..

అయితే ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన కొత్త అమ్మాయి కనిపించనుంది. కన్నడలో స్టార్ హీరోలతో కలిసి పని చేసిన రచితా రామ్‌ను ఈ సినిమాలో కథానాయకగా ఎంపిక చేసారు.. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్‌లో ఈ రచిత పాల్గొంటుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది.. ఈ సినిమాని రీజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండగా పులివాసు ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.



keywords : kannda, actress rachitha ram, kalyan dev


Show Full Article
Print Article
More On
Next Story
More Stories