రోడ్డు ప్రమాదంలో సినీనటి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సినీనటి దుర్మరణం
x
Mebina Michael (File Photo)
Highlights

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని దేవిహల్లి సమీపంలో జరిగింది. మాడికేరికి చెందిన వర్ధమాన నటి మెబీనా మైఖేల్ ‌(22) ప్రస్తుతం...

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని దేవిహల్లి సమీపంలో జరిగింది. మాడికేరికి చెందిన వర్ధమాన నటి మెబీనా మైఖేల్ ‌(22) ప్రస్తుతం టీవీ ఆర్టిస్ట్ గా చేస్తోంది. అడపా దడపా సినిమాలు కూడా చేస్తోంది. అయితే ఆమె మంగళవారం మాడికేరిలోని తన స్వగ్రామానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్‌ ఆమె కారుపైకి దూసుకెళ్లింది.. దాంతో ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు తెలుస్తోంది.

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన మెబీనా... ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఆమె మృతిపట్ల ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్ 4‌ హోస్ట్ అకుల్ బాలాజీ విచారం వ్యక్తం చేశారు. చిన్నవయసులోనే ఆమెకు ఇలా జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల కుటుంబసభ్యులు సానుభూతి తెలియజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories