తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టిస్తున్న కన్నడ సినిమా

Kannada Film Doing Business in Telugu States | Telugu News
x

తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టిస్తున్న కన్నడ సినిమా

Highlights

*తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టిస్తున్న కన్నడ సినిమా

KGF-2: కన్నడ సినిమా ఇండస్ట్రీని "కే జి ఎఫ్ చాప్టర్ 1" సినిమా ఒక మెట్టు పైకి ఎక్కించింది అని చెప్పుకోవచ్చు. కేవలం కర్ణాటక లోనే కాక ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ అయిన ఈ చిత్ర రెండవ భాగం ఇప్పుడు "కే జి ఎఫ్ చాప్టర్ 2" గా త్వరలో తెరకెక్కనుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక భారీ అంచనాల మధ్యన విడుదల అవుతున్న ఈ చిత్ర టీజర్ ఈ మధ్యనే సోషల్ మీడియాలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో యష్ రాఖీ బాయ్ పాత్రలో మరింత మాస్ అవతారంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

40 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించిన ఈ చిత్ర టీజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా కన్నడ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ బిజినెస్ చేయలేదు. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా చిత్ర క్రేజ్ అదే విధంగా ఉంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories