Kanika Kapoor: నాలుగోసారి కరోనా పాజిటివ్.. కనికా కపూర్ ఆరోగ్యం విషమం

Kanika Kapoor: నాలుగోసారి కరోనా పాజిటివ్.. కనికా కపూర్  ఆరోగ్యం  విషమం
x
kanika kapoor
Highlights

ప్రముఖ బాలీవుడ్ సింగ‌ర్ కనికా కపూర్ ఆరోగ్యం విష‌మంగా ఉంది. ఆమెకు పది రోజుల క్రితం క‌రోనా వైరస్ పాజిటివ్ తేలింది.

ప్రముఖ బాలీవుడ్ సింగ‌ర్ కనికా కపూర్ ఆరోగ్యం విష‌మంగా ఉంది. ఆమెకు పది రోజుల క్రితం క‌రోనా వైరస్ పాజిటివ్ తేలింది.ప్ర‌స్తుతం క‌నికా క‌పూర్ యూపీలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతుంది. క‌రోనా పాజిటివ్ ప‌ది రోజుల కింద వ‌చ్చిన త‌ర్వాత ఆమె పార్టీలకు వెళ్లింది. కనికా కపూర్‌పై పోలీసులు కేసు కూడా ఫైల్ చేసారు.

లండన్‌ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్‌ వచ్చిన కనికా కపూర్‌ హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆమెను క్వారంటైన్‌లోకి పంపించారు. ప్ర‌భుత్వం నిబంధ‌నలు పాటించ‌కుండా పార్టీల‌కు వెల్లింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

గ‌త పది రోజులుగా క‌నికా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో అంతా ఆందోళన చెందుతున్న్నారు. వరసగా నాలుగోసారి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని వచ్చింది. సాధారణంగా ఒకటి రెండు సార్లు పాజిటివ్ వ‌చ్చిన త‌ర్వాత కరోనా నెగిటివ్ అని వస్తుందని వైద్యులు అంటున్నారు. కానీ, కనికా కపూర్ విషయంలో ఇది జరగడం లేదు.

అయితే ఆమెకు నాలుగు సార్లు పాజిటివ్ అని రావడంతో ఏం చేయాలో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. మెరుగైన వైద్యం ఇత‌ర దేశానికి తీసుకెళ్దామన్నా కూడా విమానా స‌ర్వీసులు రద్దు అయ్యాయి. అయిన‌ప్ప‌టికి ఇత‌ర దేశాల్లో కూడా క‌రోనా కోర‌ల్లో చిక్కుకున్నాయి. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు ఎం చేయాలో పోలుపోని ప‌రిస్థితి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనికా త్వరగా కోలువాలని భ‌గ‌వంతుడిని ప్రార్థింస్తున్నామ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. మరోవైపు క‌నికా శరీరం వైద్యానికి స్పందించడం లేదంటూ వారు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories