Kangana Ranaut: కంగనా కోపం తగ్గింది..పాజిటివ్ కామెంట్ ఇచ్చింది

Kangana Surprised Everybody Praising Vidyabalan
x

, Kangana Ranaut-Vidya Balan:(File Image)

Highlights

Kangana Ranaut: ఎప్పుడూ నెగెటివ్ కామెంట్లతో సెన్సేషన్ కోసం ఎదురుచూసే కంగనా ఈసారి పాజిటివ్ కామెంట్ చేసింది.

Kangana Ranaut: ముందు బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అంటూ అందరూ పొగిడారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది అనుకున్నారు. మెచ్చుకున్నారు. తర్వాత తర్వాత ఆమె కామెంట్లలో పెరిగిపోయిన పొలిటికల్ ఫ్లేవర్ తో క్రేజ్ కాస్త నెగెటివ్ గా మారింది. శృతి మించి రెచ్చిపోవటంతో ట్విట్టర్ ఏకంగా ఆమె అకౌంట్ నే తీసేసింది. ఇన్ స్టా అయితే వార్నింగ్ ఇచ్చింది. ఎప్పుడూ నెగెటివ్ కామెంట్లతో సెన్సేషన్ కోసం ఎదురుచూసే కంగనా ఈసారి పాజిటివ్ కామెంట్ చేసింది. చాలారోజుల తర్వాత కంగనా చేసిన పాజిటివ్ కామెంట్ ఇప్పుడు ఆశ్చర్యకర వార్త అయింది. తాప్సీని ఇతర హీరోయిన్లను తన సెటైర్లతో కించపరిచిన కంగనా.. ఇప్పుడు హీరోయిన్ విద్యాబాలన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.

ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అలనాటి శృంగార తార సిల్క్ స్మితా జీవితం ఆధారంగా తీసిన 'ది డర్టీ పిక్చర్' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యా బాలన్ నటన, హావభావాలు ప్రేక్షకులను కట్టి పడేసేలా చేశాయి. దీంతో ఈ చిత్రం విద్యాబాలన్కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే, సిల్క్ పాత్రకు విద్యాబాలన్కు బదులుగా కంగనా రనౌత్ను తీసుకోవాలని దర్శకుడు మిలన్ లుథ్రియా ముందుగా అనుకున్నారట. కానీ ఈ పాత్రకు ఆమె అంగీకరించకపోవడంతో విద్యాబాలన్తో సినిమా తీశారు. ఇది ఘన విజయం సాధించింది.

ఈ చిత్రం మిస్ చేసుకోవడం గురించి కంగనా మాట్లాడుతూ.. "ఈ సినిమాలో సిల్క్ పాత్ర చేసే అవకాశం ముందుగా నాకే వచ్చింది. అయితే అప్పుడు ఈ సినిమా పొటన్షియాలిటీని గుర్తించడంలో నేను విఫలమయ్యాను. అందుకు ఇప్పుడేమీ బాధపడటం లేదు. సిల్క్ పాత్రకు విద్యాబాలన్ సంపూర్ణ న్యాయం చేసింది" అని మెచ్చుకుంది. ఒకవేళ సిల్క్ పాత్రలో తాను నటించి ఉంటే విద్యా బాలన్ మాదిరిగా పాత్రకు సంపూర్ణం న్యాయం చేసేదాన్ని కాదని అంగీకరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories