Top
logo

Kangana Ranaut: కరోనా బారిన పడ్డ మరో బాలీవుడ్ భామ

Kangana Ranaut Says She has Tested Corona Positive
X

కంగనా రనౌత్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Kangana Ranaut: బాలీవుడ్ భామ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కు కుడా కరోనా సోకింది

Kangana Ranaut: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కనిపించని శత్రువు ఎటునుంచి దాడి చేస్తుందో తెలియక సతమతమవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. బాలీవుడ్ లో సినిమాతారలు ఒకొక్కరు కరోనా బారిన పడుతున్నారు. కొంత మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. ఇటీవలే దీపికాపడుకొనే, శిల్పా శెట్టి లాంటివారు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కు కుడా కరోనా సోకింది . కాంట్రవర్సీ ఈ విషయాన్ని కంగనా స్వయంగా తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమె టెస్ట్ చేయించుకున్నారు. దాంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

కంగనా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది కంగనా. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం. ఇక కంగనాకు కరోనాగా నిర్దారణ అయిన తరవాత ఆమె సెల్ఫ్ ఐసొలేషన్స్ కు వెళ్లారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు వహిస్తున్నారు.


Web TitleKangana Ranaut: Kangana Ranaut Says She has Tested Corona Positive
Next Story