న్యాయవాదిపై కంగనా రనౌత్ ఫైర్..

న్యాయవాదిపై కంగనా రనౌత్ ఫైర్..
x
Highlights

సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలై చేసారు.

సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలై చేసారు. నిర్భయ దోషులను క్షమించాలని కోరిన ఆమెపై ఈ వ్యాఖ్యలు చేసారు. విలేకరులతో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగానే కంగనా నిర్భయ తల్లికి ఇందిరా జైసింగ్ చేసిన అభ్యన్తరాలని గురించి మాట్లాడారు.

అయితే గత ఏడేళ్ల క్రితం మన దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ పై జరిగిన జరిగిన అత్యాచారం విషయం మనకు తెలిసిందే.. ఆ ఘటనలో నిర్భయ ప్రాణాలు కోల్పోయింది. అప్పటి నుండి తల్లి ఆశాదేవి తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఉండాలని ఆమె న్యాయ పోరాటం చేసిందని ఇప్పటికి నిందుతులకి సుప్రీమ్ కోర్ట్ ఉరి శిక్ష విధించింది అని కంగనా అన్నారు.

అయితే నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి ఖరారయ్యింది. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి తీయ్యాలంటూ ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు తీర్పునిచ్చింది. ఇందులో ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌తో వీరి ఉరిశిక్ష ఆలస్యమైంది. రాష్ట్రపతి, క్షమాభిక్షను తిరస్కరించడంతో వీరికి ఉరి శిక్ష అమలుకు అడ్డంకులు తొలగాయి. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు. 2012లో నిర్భయపై నిందితులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యారు.

కంగనా, అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి, కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు.. హంతకులకు జన్మనిస్తారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories