బిగ్ బ్రేకింగ్ : 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' : వర్మ సినిమా పేరు మార్పు..!

బిగ్ బ్రేకింగ్ :  అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు : వర్మ సినిమా పేరు మార్పు..!
x
Highlights

రామ్ గోపాల్ వర్మ తాజా సెన్సేషన్ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆపాల్సిందిగా...

రామ్ గోపాల్ వర్మ తాజా సెన్సేషన్ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆపాల్సిందిగా మతప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ పై ఉత్తర్వులు వెలువడనున్నాయి.ఇదిలావుంటే సెన్సార్ బోర్డు మాత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టైటిల్ విషయంలో అభ్యంతరం చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా పేరు మార్చాల్సి వస్తే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే టైటిల్ పెడతానని వర్మ ప్రకటించారు.

టైటిల్ మార్పు విషయంపై గురువారం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కాగా ఈ సినిమా పూర్తి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పి అందరికి షాకిచ్చాడు వర్మ. తాను ఏ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయలేదని, అలాగే తనకు ఎవ్వరి దగ్గరి నుంచీ ఎటువంటి బెదిరింపులు రాలేదని వర్మ చెప్పాడు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ వర్గాన్ని తక్కువచేసి చూపించలేదని ఆయన పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories